టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటీషన్ను కొట్టివేసింది. మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేయవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా జరగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో నిందితులు పోలీసుల కస్టడీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. పోలీసుల దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్

© Envato