TS: సీబీఐ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కవిత సీబీఐకి లేఖ రాశారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా స్పందించడానికి వీలు అవుతుందని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాతే విచారణ తేదీని ఖరారు చేయొచ్చని కవిత అలోక్కుమార్కి లేఖ రాశారు. అయితే, ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ తరఫున అలోక్‌కుమార్ నోటీసులు పంపించారు. తన నివాసంలో విచారణకు రెడీ అని కవిత నిన్న వెల్లడించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో చేతులు మారిన లావాదేవీలపై సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.
సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

© ANI Photo(file)