ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి చెంపపెట్టు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. ఈ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి హెచ్చరిక అని విమర్శించారు. ఏపీ భవిష్యత్‌కు పట్టభద్రులే భవిష్యత్ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ తన ధన్యావాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల ఆలోచనా ధోరణి మారిందని అభిప్రాయపడ్డారు.