బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ ఎదుట మరోసారి హాజరుకానున్నారు. ఈ నెల 11న ఆమెను ఈడీ విచారణ చేసింది. అనంతరం మళ్ళీ హాజరు కావాలని కవితకు సూచించగా ఆమె దిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ ఎదుట హాజరు కానున్నారు. అయితే, అంతకన్నా ముందు కవిత ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న ఆరోపణల గురించి కవిత క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఆధారాలు దొరకకుండా ఫోన్లను ధ్వంసం చేశారన్నఆరోపణలపై కూడా స్పందించనున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది.