హైదరాబాద్లో నేడు, రేపు MMTS లోకల్ ట్రైన్లు నడవవని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రాక్ మరమత్తులు, ఆపరేషనల్ వర్క్ వల్ల మొత్తం 19 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. లింగంపల్లి- ఫలక్నుమా, నాంపల్లి- లింగంపల్లి, ఫలక్నుమా- రామచంద్రాపురం రూట్లో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వివరించింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.