మోడల్‌గా ఎదుగుతున్న ఓ యువతిపై ఫోటోగ్రాఫర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గుజరాజ్ రాజధాని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని 35 ఏళ్ల ప్రశాంత్ ధనక్గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..నిందితుడికి యువతికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. తన కెరీర్‌కు అండగా ఉంటానని ధనక్ చెప్పడంతో ఆమె తన గ్రామం నుంచి సిటీకి వచ్చింది. గత నెల నవంబర్‌లో ఓ క్లయింట్‌ను కలవాలని హోటల్‌కు పిలిచి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని యువతిని హెచ్చరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.