బీబీసీ రూపొందించిన ప్రధాని మోదీ డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా విద్యార్థులపై పలు వర్సిటీలు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు గుంపులుగా గుమిగూడవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు రాత్రి విశ్వవిద్యాలయంలో డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఉండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జేఎన్యూ వర్సిటీలో విద్యార్థులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.