2G ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోడీ

© ANI Photo

పానిపట్ రిఫైనరీలో నిర్మించిన ఇండియన్ ఆయిల్ 2G ఇథనాల్ ప్లాంట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సుమారు రూ.900 కోట్ల అంచనా వ్యయం నిర్మించిన ఈ ప్లాంట్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ప్లాంట్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించగా.. ఏటా ఈ ప్లాంట్ నుంచి 3 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

Exit mobile version