కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులతో పీఎం నరేంద్ర మోడీ నేడు సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓ వైపు అల్లర్లు చెలరేగుతుండగా పీఎం సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదని తెలిపిన త్రివిధ దళాలు.. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో భవిషత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.