భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆవిష్కరించారు. రిమోట్ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన ఆయన.. అనంతరం మాట్లాడారు. తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అల్లూరి జయంతి రోజున మనమందరం కలుసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఆంద్ర రాష్ట్రం పుణ్యభూమి, వీరభూమి అని, ఆ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, చిరంజీవి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

© ANI Photo