నేడు భీమవరంలో పర్యటించనున్న మోడీ

© ANI Photo

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు ఏపీలోని భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామ రాజు జయంతిని పురష్కరించుకొని అక్కడ ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరు కానున్నారు.

Exit mobile version