• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ

    వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ కింద అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన 11 మంది బాలలతో ప్రధాని మోదీ నేడు ముచ్చటించనున్నారు. దిల్లీలోని ఆయన నివాసంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. స్పోర్ట్స్, ఆర్ట్& కల్చర్, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్కాలస్టిక్, బ్రేవరీ విభాగాల్లో ఘనత సాధించిన 11 మంది చిన్నారులను దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కేంద్రం ఎంపిక చేసింది.