జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈసారి సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 13-ఏప్రిల్ 6 వరకు రెండో విడదత సమావేశాలు జరుగుతాయి. మోదీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.