ఐపీఎల్ 15వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నద్దమవతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అందుబాటులో ఉండడంలేదు. భారత్ వచ్చేందుకు కొన్ని రోజులుగా వీసా కోసం ఎదురు చూసున్న ఈ ఆల్ రౌండర్ కు ఎట్టకేలక వీసా పేపర్లు లభించాయి. కానీ, కరోనా నిబంధనల కారణంగా భారత్ లో అడుగుపెట్టగానే అతడు ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుందని సీఎస్కే మేనేజ్మెంట్ పేర్కొంది. అయితే, మొయిన్ అలీ ప్రారంభ మ్యాచ్ కు ఆడకపోయినా మిగతా మ్యాచ్ లలో ఆడేందుకు వీసా అనిశ్చితి తొలగిపోవడం సంతోషకరమని తెలిపింది.