హైదరాబాద్ గల్లీ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ దాకా ఎదిగిన మన సంచలనం మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్లో సిరాజ్ నం.1 స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటిదాకా 21 వన్డేలు ఆడిన సిరాజ్ 38 వికెట్లు తీశాడు. సిరాజ్ 729 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, 727 పాయింట్లతో హెజిల్వుడ్ రెండో స్థానంలో, 708 పాయింట్లతో ట్రెంట్ బౌల్డ్ మూడో స్థానంలో ఉన్నారు. సిరాజ్ కాకుండా టాప్-10లో ఒక్క ఇండియా బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం.