టీ20 ప్రపంచకప్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ ఎంపికయ్యాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్లను కాదని షమీని ప్రధాన జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ధృవీకరించాడు. భారత జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడే సమయానికి షమీ జట్టుతో కలుస్తాడని జైషా తెలిపారు. కాగా మహ్మద్ షమీ గత టీ20 వరల్డ్ కప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు అదే వరల్డ్ కప్లో తిరిగి ఆడబోతున్నాడు.
బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ

© ANI Photo