టీమిండియా పేసర్ మహ్మద్ షమికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నెలవారీగా తన మాజీ భార్య హసిన్ జహన్కు రూ.50వేల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తనను వేధిస్తున్నాడంటూ గతంలో షమిపై హసిన్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం షమి నుంచి విడిపోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెలకు రూ.10లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ హసిన్ దాఖలు చేసిన పిటిషన్ని కోల్కతా న్యాయస్థానం విచారణ చేసింది. అయితే, తుది తీర్పులో భరణాన్ని రూ.50వేలకు మాత్రమే పరిమితం చేయడంపై హసిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.