ప్రముఖ రచయిత్రి, పారిశ్రామికవేత్త సుధామూర్తి కుటుంబాలు, పిల్లల పెంపకం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇంట్లోనే పెంపొందించాలని సుధామూర్తి అన్నారు. వీటికోసం ప్రత్యేకంగా తరగతులు గానీ, సిలబస్ గానీ లేదని తల్లులే వీటిని పెంచాలన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు గ్యాడ్జెట్స్ వాడటం మానేయాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. అలాగే పిల్లలు కనీసం రోజుకు ఒకసారైనా తల్లిదండ్రులతో మాట్లాడాలని అన్నారు.