ఈ నెల 28న పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. 2022 ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020-21 రబీ సీజన్‌కు సంంబంధించి 2.54 వేల మందికిి రూ.45.22 కోట్లు, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్ల చొప్పున సున్నా వడ్డీ జమ చేయనున్నారు.