దేశంలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాలిక నుంచి నమూనాలు సేకరించి పుణేలోని ఐసీఎంఆర్ ల్యాబ్ కు పంపించగా నెగెటివ్ గా నిర్ధరించారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని యూపీ ఆరోగ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సూచించారు. టెస్టులు కేవలం ముందు జాగ్రత్త చర్యలు మాత్రమేనని ఎవరూ ఆందోళనకు గురికావద్దని వైద్యులు చెప్పారు. ఇప్పటివరకైతే దేశంలో ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదుకాలేదు.