మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోకి ఎంటరైన తర్వాత తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం తెలంగాణ నుంచి ఉపరితల ద్రోణి దూరంగా వెళ్లినట్లు చెప్పారు. మరోవైపు గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు రుతుపవనాలు ముందు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.