నేడు తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు

© Envato

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు నేడు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈవాళ మధ్యాహ్నం వరకు రుతుపవనాలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని, దీని కారణంగా ఇరు రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అవి ఇలానే చురుగ్గా కొనసాగితే 3-4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించారు.వాన కబురుతో విత్తులు విత్తేందుకు ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version