మునుగోడు ఉపఎన్నికలో నైతిక విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంది మంత్రులను దించి TRS ప్రచారం నిర్వహించినపుడే తన విజయం ఖాయమైందన్నారు. హోరా హోరీ పోరులో విజయం తమనే వరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కౌంటింగ్లో సమన్వయ లోపం కనిపిస్తోందని, ఫలితాల ప్రకటనలో ఆలస్యమెందుకు అవుతుందో తెలియడం లేదన్నారు.
మునుగోడులో నైతిక విజయం నాదే: రాజగోపాల్ రెడ్డి

© File Photo