మరింత పెరగనున్న వంటనూనె ధరలు

© Envato

దేశంలో మరోసారి వంటనూనెల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేసే ఇండోనేషియా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుంది. అక్కడి ఆహార ద్రవ్యోల్బనాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడే అవకాశముంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న పామాయిల్‌లో 60 శాతం ఇండోనేషియా నుంచే వస్తుంది. ఇండోనేషియా తాజా నిర్ణయంతో దిగుమతి ఆగిపోతే ధరలు పెరుగుతాయి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నంకాకుండా ముందస్తు చర్యలో భాగంగా నూనె గింజల సాగుకు రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version