తెలంగాణలో 5 వేల మందికి పైగా అండర్ ట్రయల్ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్నారు. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(NCRB) 2020 వివేదిక వెల్లడించింది. సగటున 5% మంది అండర్ ట్రయల్ కేసుల్లో దాదాపు రెండేళ్లుగా జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది బెయిల్ పొంది 2 నెలల్లోపు బయటకు వెళ్లిపోతారు. కానీ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సహా పలు కేసుల్లో బెయిల్ పొందడం కష్టమని అధికారులు అంటున్నారు. మరోవైపు న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు ఉండటం కూడా ఓ కారణమని చెబుతున్నారు.