జపాన్లో కోటికి పైగా కోళ్లను వధించనున్నారు. అక్కడ బర్డ్ ఫ్లూ వైరల్ అధికంగా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. సాధారణంగా అక్కడ అక్టోబరు నుంచి మే నెల మధ్యలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తుంటుంది. కానీ, ఈ దఫా పుట్టుకొచ్చిన వైరస్ వేగంగా సంక్రమిస్తుండటంతో ఈ సీజన్లో కోటికి పైగా కోళ్లను చంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 సీజన్లో ఇదే కారణంతో దాదాపు 98లక్షల కోళ్లను వధించడం గమనార్హం.