మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాదీ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి మంగల్ ప్రభాత్ లోధా తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన శ్రద్ధా వాల్కర్ లాంటి కేసులు జరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మతాంతర వివాహాలపై కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తుందన్నారు. బడ్జెట్ సెషన్ సమయంలోనే కొత్త వుమెన్స్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.