ALERT: మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

© ANI Photo

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణ నదులు పొంగి పారుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నేటి సాయంత్రానికి 70 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నేడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Exit mobile version