ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2021లో న్యూఢిల్లీ వరుసగా నాలుగో సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా అవతరించింది. ప్రపంచంలోనే 100 కాలుష్యపూరిత నగరాల్లో 63 నగరాలు మనవే కావడం విశేషం. WHO ప్రకారం PM2.5 వార్షిక గాలి నాణ్యతను ఏ దేశమూ అందుకోలేదని నివేదిక పేర్కొంది. కాగా, PM2.5 గాలిలో సరాసరి 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కు పైన ఉండడం ఆరోగ్యానిక హానికరం. కానీ మన దేవంలో ఇది 58.1 గా ఉన్నట్లు తేలింది. 6,475 నగరాల్లోని వాయు పర్యవేక్షణ స్టేషన్ల నుండి PM2.5 వాయు కాలుష్య కొలతలను విశ్లేషించినట్లు తెలుస్తోంది.