TS: తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఓ యువ వితంతువు ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల కిందట భర్త చనిపోగా.. నిజామాబాద్‌లోని తల్లిగారి ఇంటివద్ద మానస(27) ఉంటోంది. స్థానికంగా ఉన్న షాపింగ్ మాల్లో పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తోంది. ఈ క్రమంలో పిల్లల్ని తీసుకుని మానస బాసరకు వచ్చింది. కడసారిగా వారికి అన్నం తినిపించింది. అనంతరం స్యూలు బ్యాగుల్ని పుష్కరఘాట్ వద్ద వదిలేసి పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహలను పోలీసులు వెలికితీశారు.