బిడ్డ ఇంటిపేరును నిర్ణయించే అధికారం తల్లికే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భర్త మరణానంతరం రెండో పెళ్లి చేసుకున్న మహిళ భర్త పేరును స్టెప్‌ఫాదర్‌గా చేర్చాంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు క్రూరమైందని తెలిపింది. అది పిల్లల ఆత్మగౌరవం దెబ్బతీస్తుందని, మానసికంగా వారిపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. తండ్రి మరణిస్తేబిడ్డకు తల్లి సంరక్షురాలిగా ఉంటుంది కాబట్టి, ఇంటి పేరును నిర్ణయించే హక్కు ఆమెకే ఉంటుంది. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా పిల్లల ప్రయోజనాలను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసం సూచించింది.