ఓ యువకుడు తన తల్లికి రెండో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని కొల్హాపూర్లో చోటు చేసుకుంది. యువరాజ్ షేలే(23) అనే యువకుడు ఐదేళ్ల కిందట తండ్రిని కోల్పోయాడు. అప్పటినుంచి తన తల్లి ఒంటరిగా జీవిస్తూ ఇంటికే పరిమితమైపోయి బయటకు రావడం లేదు. దీంతో ఆమెను మామూలుగా చేయాలని యువరాజ్ నిర్ణయించుకున్నాడు. ఆమెకు పెళ్లి చేయాలని భావించి వరుడుని కూడా వెతికాడు. సమాజాన్ని ఎదిరించి మరీ మారుతి అనే వ్యక్తితో ఆమెకు వివాహం చేశాడు.