87 ఏళ్ల వయసు ఉన్న హరిరామజోగయ్యతో ఉద్యమం చేయించడం సిగ్గుచేటని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అన్నారు. ‘‘ సీఎం వైఎస్ జగన్ కాపు కులానికి బీసీ రిజర్వేషన్ ఇస్తాననలేదు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కాపులను వాడుకుంటున్నారు. కాపులందరూ అప్రమత్తంగా ఉండాలి. కాపులకు 5 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదు. అన్నీ తెలిసినా ప్రభుత్వంపైకి కాపులను ఉసిగొల్పుతున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలసి నాటకం ఆడుతున్నారు’’ అంటూ ఆయన మండిపడ్డారు.