‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తాజాగా జక్కన్న టేకింగ్‌ని ప్రశంసిస్తూ లాస్ ఎంజిల్స్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని డైరెక్టర్ హరీశ్ శంకర్ షేర్ చేశారు. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ ‘మీరు కూడా పవన్ కళ్యాణ్‌తో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తీయండి. ఫైట్లు సహజంగా ఉండాలి. గబ్బర్‌సింగ్‌లాంటి మసాలా వద్దు’ అని సూచించగా.. ‘సారీ బ్రదర్.. నేను అంగీకరించను’ అంటూ హరీశ్ శంకర్ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. కాగా, పవన్‌తో హరీశ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.