కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఈ కేసును విచారించవచ్చని సీబీఐకి అనుమతి ఇచ్చింది. అవినాశ్ తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కాగా వివేకా హత్యలో తాను పాల్గొన్నట్లు ఆధారాలు లేవని అవినాశ్ కోర్టులో పిటీషన్ వేశారు.