తెలంగాణలోని చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి బాహుబలి దున్నతో కుస్తీ పట్టారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన కుటుంబసమేతంగా సందడి చేశారు. బాహుబలి సెట్లో ఆయన కలియతిరిగారు. కాసేపు బాహుబలి దున్నతో కుస్తీ పట్టారు. కాగా రంజిత్ రెడ్డి తొలుత చేవెళ్లలో ఫౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ స్థాపించాడు. 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలుపొందాడు.