మృగశిర కార్తెలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో నైరుతి రుతుపవనాలు వస్తాయి. తొలకరి జల్లులు పలకరించడంతో రైతులు పొలాలు దున్ని పంటలు పంటలు వేస్తారు. రోహిణి కార్తెలో తీవ్ర ఎండలతో వేడెక్కిన వాతావరణం మృగశిర కార్తిలో చల్లబడుతుంది. ఇది 15 రోజులపాటు ఉంటుంది. మొదటిరోజు బెల్లం ఇంగువ తింటే ఈ సమయంలో వచ్చే వ్యాదుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ కార్తెలో ఇక చేపలను ఎక్కువగా తింటారు.భారత జ్యోతిస్య సాంప్రదాయం ప్రకారం సూర్యడు 27 నక్షత్రాలలోకి ప్రవేశించినప్పుడు కార్తెలను నిర్ణయిస్తారు. ఒక్కో కార్తెలో వాతావరణంలో వర్వేరు మార్పులు జరుగుతుంటాయి.