రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సరికొత్త రికార్డును సృష్టించారు. అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో టాప్-10 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు రిచెస్ట్ టెలికాం ఎంట్రప్రెన్యూర్ బిరుదును కూడా సంపాదించాడు. తన సంపద గత ఏడాది 24 శాతం పెరిగి రెండో ఏడాది వరుసగా ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. గౌతమ్ అదానీ 49 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టెస్లా, స్పేస్ఎక్స్ CEO ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, LMVH CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.