మధ్యప్రదేశ్ తో జరుగుతున్న రంజీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(102*) సెంచరీ చేశాడు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ తీసుకున్న ముంబై బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా కానీ సర్ఫరాజ్ మాత్రం చెక్కుచెదరకుండా నిలబడ్డాడు. మధ్యప్రదేశ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ముంబై జట్టు 8 వికెట్లు కోల్పోయి 115 ఓవర్లలో 331 పరుగులు చేసింది. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 3 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.