ఓటీటీ తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో నుంచి ముముత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఆమె ఎలిమినేషన్ జరిగిందని వ్యాఖ్యాత నాగార్జున పేర్కొన్నారు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో మోస్ట్ హ్యాపెనింగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచిన ముమైత్ ఖాన్.. రెండో వారంలో తన స్థానాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది. 24×7 ప్రసారమైనందున, OTT వెర్షన్ ప్రారంభంలో వీక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం వీక్షకులు పెరిగినట్లు హోస్ట్ నాగార్జున వెల్లడించారు.