ఫిఫా ప్రపంచకప్ లో మెురాకో ఓటమి ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్రాన్స్ చేతిలో పరాజయం పాలవ్వటంతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో హింస చెలరేగింది. కొంతమంది అభిమానులు విధ్వంసం సృష్టించారు. 100 మంది ఆందోళన కారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వీధుల్లో టపాలు విసిరి.. వీధుల్లోని చెత్త సంచులు పోగుచేసి నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు.ఫ్రాన్స్ అభిమానులు కొందరు కారులో వచ్చి వెళ్తుండగా బాలుడిపైకి ఎక్కి చనిపోయాడు.