మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి సౌతిండియాలో అత్యంత సక్సెస్ఫుల్ సంగీత దర్శకులలో ఒకడిగా నిలిచాడు. ఇటీవల ఎన్నో దుమ్మురేపే మాస్ సాంగ్స్ ను ప్రేక్షకులకు అందించాడు. అయితే, తాజాగా జరిగిన ఓ సంఘటన నెటిజన్స్ లో తీవ్ర ట్రోలింగ్‌కు దారితీసింది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పట్టుబట్టాడు. అయితే, తాజాగా థమన్ ఓ చిన్న మ్యూజిక్ క్లిప్పింగ్ ను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఇది గమనించిన ఓ నెటిజన్ షిరిడి సాయి పాటలోని ఎమోషనల్ మ్యూజిక్ లా ఉన్నట్లు గుర్తించాడు. దీంతో నెటిజన్లు థమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.