తన కూతురు గ్రూప్ 2 పరీక్ష రాయలేదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. నిందితుడు ప్రవీణ్ గ్రూప్1 పరీక్ష రాసిన మాట వాస్తవమేనని.. కానీ సెలెక్ట్ కాలేదని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్షలు వాయిదా వేయాలా? లేదా మరే ఇతర నిర్ణయం తీసుకోవాలా అనేది చెబుతామన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో మల్టీపుల్ జంబ్లింగ్ పద్ధతి అనుసరించామని తెలిపారు. మాస్ కాపీయింగ్ జరిగే అవకాశమే లేదు అని పేర్కొన్నారు.