కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు రజతం సాధించిన సంకేత్ భావోద్వేగానికి లోనయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ మా నాన్న స్వర్ణం సాధిస్తానని చెప్పా, కానీ రజతంతో కూడా ఆయన సంతోషంగానే ఉన్నారు. ఈ పతకం తో మా కుటుంబం గతి మారుతుందని భావిస్తున్నా. ఇంకా మా నాన్న పాన్ షాప్ నడపాలని నేను కోరుకోవడం లేదు.’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. సంకేత్ తండ్రి మహారాష్ట్రలోని సాంగ్లిలో పాన్ షాప్ నడుపుతుంటాడు. సంకేత్ పురుషుల 55 కేజీల విభాగంలో సిల్వర్ సాధించాడు.