ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ జంటగా తెరకెక్కిన బలగం చిత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రియదర్శి మాట్లాడారు. ‘బలగం ఓ గొప్ప సినిమా. దీన్ని చూసిన నా ఫ్యామిలి మెంబర్స్, ఫ్రెండ్స్ మల్లేశం తర్వాత మంచి మూవీ చేశావని అన్నారు. ఆడియన్స్ థియేటర్స్‌లో ఏడ్చినప్పటికీ సంతోషంగా బయటకు వస్తున్నారు. నా ఫ్రెండ్ బలగం చూసి నాకు ఫోన్ చేశాడు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చేశాడు. హృదయాలను కదిలించి విమర్శకుల ప్రశంసలు పొందింన చిత్రం బలగం’ అని అన్నారు.