ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణించాడు. కెప్టెన్‌గా, బౌలర్‌గా, బ్యాటర్‌గా మంచి ప్రదర్శన కనబర్చి జట్టుకు ట్రోఫీ అందించాడు. దీనిపై హార్దిక్ స్పందించాడు. ఐపీఎల్లో అయిదు ట్రోఫీలు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తానని, ముంబై తరఫున అందుకున్న ట్రోఫీల కంటే, కెప్టెన్‌గా అందుకున్న ట్రోఫీ తనకెంతో ప్రత్యేకమన్నాడు. ప్రస్తుతం తన ద్రుష్టి అంతా టీమిండియాకు వరల్డ్ కప్ తేవడంపై ఉందని, ఆటగాడిగా ఇండియా జట్టుకు ఆడితేనే సంతోషంగా ఉంటానని పేర్కొన్నాడు. టీమిండియాకు వరల్డ్ కప్ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి