తెలంగాణలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మై హోమ్ గ్రూప్, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు ఓటీటీ ఆహాలో గీతా ఆర్ట్స్‌తో పాటు ప్రధాన వాటాను కలిగి ఉంది. ఈ సంస్థ ప్రస్తుతం చిత్ర నిర్మాణంలోకి రానుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలకు ఫైనాన్స్ అందిస్తున్న ఈ సంస్థ, భవిష్యత్తులో స్వయంగా పూర్తి నిర్మాణ బాధ్యలను చేపట్టనుంది. మై హోమ్ గ్రూప్ నుంచి రాబోయే రోజుల్లో కొన్ని పెద్ద ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్‌తో కూడిన చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అలాగే మ్యూజిక్ విభాగాన్ని కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.