నిత్యం వేధిస్తుండడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఈ ఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, వనితలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. అనుమానంతో వనితను తీవ్రంగా వేధిస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ ఒక లెటర్ రాసింది. పిల్లలను తన భర్తకు అప్పగించవద్దని, ఆయన పెద్ద సైకో అని, అందుకే చనిపోతున్నాను అంటూ పేర్కొంది.