తన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి హింట్ ఇచ్చారు. ఓ టీవీ డెబెట్‌లో మాట్లాడుతూ.. నా ఆలోచన మా అన్నయ్య ఆలోచన ఒకటే. మునుగోడు ప్రజల కోసం ఇద్దరం ఒకేరకంగా ఆలోచిస్తాం. మునుగోడు సమస్యల గురించి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉపఎన్నిక వస్తేనే నియోజవర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఉపఎన్నిక తీర్పు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పారు.