అంతుచిక్కని మాతంగ్‌ తెగ రహస్యాలు

© Envato(representational)

శ్రీలంకలోని పిర్దు పర్వతశ్రేణిలో నివసిస్తున్న ‘మాతంగ్‌’ తెగతో హనుమంతుడు మాట్లాడతాడట. ప్రతి 41 ఏళ్లకు ఒకసారి హనుమంతుడు ఈ తెగవారిని కలుస్తాడని చెబుతారు. ఇప్పటికీ ఈ తెగవారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నారు. శ్రీ రాముడి జల సమాధి అనంతరం హనుమంతుడు శ్రీలంకలోని పిర్దు పర్వత శ్రేణిలో తపస్సు చేశాడట. ఆ సమయంలో మాతంగ్‌ తెగవారే ఆయనకు సంరక్షకులుగా ఉన్నారట. వారి సేవకు మెచ్చిన హనుమ ప్రతి 41 ఏళ్లకు మీకు దర్శనమిస్తానని వరమిచ్చాడట. హనుమ వారిని కలిసినపుడు చెప్పిన మాటలు కూడా వారు రాసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రస్తుతం సేతు అనే ఓ సంస్థ పరిశోధిస్తోంది.

Exit mobile version